వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్రకథలో ఆమ్మాయిల రికార్డింగ్ డాన్సులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Burrakatha
విజయనగరం: విజయనగరం జిల్లాలో బుర్రకథ చూస్తే మత్తెక్కించే ఆడావారి రికార్డింగ్ డాన్సులు ఫ్రీ. దసరా ఉత్సవాల సందర్భంగా జిల్లాలో బుర్రకథకు టిక్కెట్ కొంటో ఆ తర్వాత రికార్డింగ్ డాన్సు చూడవచ్చు. కొంచెం ఇష్టం కొంచెం కష్టంలాగా మొదట బుర్రకథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొద్ది సేపటికి రికార్డింగ్ డాన్సు ఉంటుంది. మళ్లీ కొద్ది సేపటి తర్వాత బుర్రకథ, తర్వాత రికార్డింగ్ డాన్సు. ఇలా రెండింటినీ ఒకేసారి కొంచెం కొంచెంగా ప్రదర్శిస్తారు. కొన్నిచోట్ల యువతను ఆకట్టుకోవడానికి డాన్సులు శృతిమించుతున్నాయి.

కళలకు పుట్టినిల్లు అయిన విజయనగరం జిల్లాలోని కళాకారులు సంప్రదాయ కళలకు నూకలు చెల్లడంతో తాము కళలను రక్షించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో బుర్రకథతో పాటు ఆడవారితో రికార్డింగ్ డాన్సులు చేపించవలసి వస్తుందంటున్నరు. అయితే కొందరు దీనిపై పెదవి విరుస్తున్నారు. మరికొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఎవరు ఏమన్నప్పటికీ యువత మాత్రం బుర్రకథ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. మరి బుర్రకథతో పాటు రికార్డింగ్ డాన్సు ఫ్రీ కదా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X