వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన బ్రదర్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు: విశ్వాస పరీక్షలో నెగ్గిన కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప మరోసారి మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించే ఆలోచనలో ఉన్నారు. కొంత మందికి ఉద్వాసన, మరి కొంత మందికి ప్రవేశం కల్పిస్తూ ఆయన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటున్నారు. దానికోడు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుందని అంటున్నారు. ఉద్వాసన పలికిన నలుగురి స్థానంలో కొత్తవారిని తీసుకోవడంతో పాటు ఆరు ఖాళీలను కూడా ఆయన భర్తీ చేస్తారని చెబుతున్నారు.

గాలి బ్రదర్స్ లో ఒక్కరికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడానికి యడ్యూరప్ప సిద్ధపడినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి గానీ, గాలి కరుణాకర్ రెడ్డికి గానీ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. రెండోసారి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కాపాడడంలో గాలి జనార్దన్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. అసమ్మతి శాసనసభ్యులతో మాట్లాడి కొందరిని వెనక్కి తీసుకురావడంలో ఆయన విజయం సాధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X