హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్లు అరవింద్, జెపిలకు అలయ్ భలయ్ లో తెలంగాణ తిప్పలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే అలయ్ బలయ్ లో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అల్లు అరవింద్ లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతా తెలంగాణ వాతావరణం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఛాయలు ఉండడంతో సమైక్యవాదులైన వారికి తిప్పలు తప్పలేదు. సంస్కృతి సంప్రదాయాలకు భారత దేశం నిలువుటద్దం అని, మతాలు, కులాలకతీతంగా ప్రపంచంలోనే భారతదేశం ఆదర్శమని జెపి అన్నారు. అయితే మాట్లాడిన అనంతరం ఆయన జై తెలంగాణ, జై తెలుగునేల, జై భారత్ అని వెంటనే వెళ్లిపోయారు. తెలంగాణ అంటే కూడా తెలుగునేలనే అని ఆయన అన్నారు. తెలంగాణ, తెలుగు సంస్కృతిని కాపాడటానికి దత్తాత్రేయ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారని అల్లు అరవింద్ అన్నారు. మొత్తానికి ఇద్దరూ తెలంగాణ ఊసెత్తకుండా కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్లిపోయారు.

కాగా హైదరాబాద్ లోని జలవిహార్ లో భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి దర్పణమైన అలయ్ బలయ్ ని నిర్వహించటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విజయానికి ప్రతీక అయిన విజయ దశమి రోజు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకరికి ఒకరు జమ్మి పెట్టుకొని కౌగిలించుకుంటారు. ఇది తెలంగాణకు ప్రశస్తమైనది. బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల వారిని ఆహ్వానించారు. వచ్చిన వారందరికీ దత్తాత్రేయ అంబలి పంచారు.

అలయ్ బలయ్ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట ఎమ్మెల్య కిషన్ రెడ్డి, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్, లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ప్రజారాజ్యం పార్టీ తరఫున అల్లు అరవింద్, కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు, కె.కేశవరావు, దానం నాగేందర్, కాకా, సిరిసిల్ల ఎమ్మెల్యే, తెరాస అధినేత కెసిఆర్ కుమారుడు కెటిఆర్, మేయర్ కార్తీక రెడ్డి, రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం, బిజెపి మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిత్ర నటుడు వేణుమాధవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలు ప్రదర్శించారు. ఆలయ్ బలయ్ పూర్తిగా తెలంగా రాజణకు సంస్కృతిలో జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X