వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగాళాఖాతంలో తీరం దాటిన వాయుగుండం

By Pratap
|
Google Oneindia TeluguNews

Bay of Bengal
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తీరం దాటింది. పూరీకి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది ఛత్తీస్‌ గఢ్, ఉత్తరాంధ్రకు సమీపంలో భూ ఉపరితలంపై విస్తరించి మరింత బలహీనపడనుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్నాయి. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.

వీటి ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో తెలంగాణాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా పలాస, రణస్థలంలో అత్యధికంగా 5 సెం.మీల వర్షపాతం నమోదైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X