అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్త చరిత్ర చిత్రాన్ని ఫ్యాన్స్ మధ్య కూర్చొని చూస్తాను: పరిటాల సునీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paritala Sunitha
అనంతపురం: రక్త చరిత్ర చిత్రాన్ని అభిమానుల మధ్య కూర్చునే చూస్తానని అనంతపురం తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర సతీమణి పరిటాల సునీత చెప్పారు. తాను రక్త చరిత్ర చిత్రాన్ని చూశానని వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, వాటిలో ఏ మాత్రం నిజం లేదని ఆమె చెప్పారు. చిత్రం విడుదనయిన తర్వాత అందరి మధ్య చూసి ఆ తరువాత ఆ చిత్రంలోని పాత్రలు, వాటి తీరుతెన్నుల గురించి స్పందిస్తానని ఆమె చెప్పారు. సినిమాలోని ఒక్క పాట మాత్రమే విన్నానని ఆమె చెప్పారు.

ఇటీవల రక్తచరిత్ర పలు వివాదాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలోని ఊరికి అనంతపురం పెట్టవద్దని, దానిని తీసివేసి ఆనందపురంగా పెడితే విజయనగరంలోని ఆనందపురం గ్రామస్తులు పేరును తీసివేయకపోతే ఉత్తరాంధ్రలో అడ్డుకుంటామని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే బెజవాడ తెలుగు దేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ రక్త చరిత్రను పరిటాల సునీతకు చూపించిన తర్వాతనే విడుదల చేయాలని ఆల్టిమేటం జారీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X