గద్దర్ వ్యతిరేకం వర్గం తెలంగాణ కమిటీ: విమలక్క సారథ్యం

ఉద్యమం ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుందని తాము కూడా గట్టిగా నమ్ముతున్నామని, అయితే ఎన్నికలను కూడా పోరాట రూపంగా గుర్తించాలనేది తమ అభిప్రాయమని ఆమె అన్నారు. తెలంగాణ సాధన కోసమే తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బైరాన్ పల్లిలో పుట్టిన సర్దార్ పాపన్న ఖిలాషాపురంలో ఉండి ఉద్యమాలు చేశాడని, ఆయనను ఆదర్శంగా తీసుకొని త్వరలో ఖిలాషాపురం వెళ్లి అక్కడి పాపన్న విగ్రహం ముందు తెలంగాణ సాధన కోసం ప్రమాణం చేస్తామని చెప్పారు. గద్దర్ తో వ్యతిరేకించిన వర్గం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications