హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొమురం భీం విగ్రహంపై విద్యాసాగర్, దానం మధ్య మాటల యుద్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: నిరంకుశ నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి, గిరిజనుల హక్కుల కోసం పాల్పడిన కొమురం భీం విగ్రహాన్ని ట్యాంకుబండ్ పై ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ మంత్రి విద్యాసాగర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొమురం భీం 70వ వర్ధంతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ట్యాంకుబండ్ పైన ఆయన విగ్రహం పెట్టకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే మేమే అందుకు పూనుకుంటామన్నారు. ట్యాంకుబండ్ పైనున్న విగ్రహాలలో అనవసర విగ్రహాలు ఉన్నాయని, వాటిని కూల్చివేసి ఆ స్థానంలో కొమురం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొమురం భీం గిరిజనుల కోసం పోరాడిన యోధుడన్నారు.

విద్యాసాగర్ రావు మాటలకు ఆరోగ్య శాఖమంత్రి దానం నాగేందర్ స్పందించారు. గిరిజన నాయకుడు కొమురం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన అయనకు ఇప్పుడు రావటం హాస్యాస్పదం అన్నారు. డిఎన్ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పని చేశారని అప్పుడు గుర్తుకు రాని కొమురం భీం ఇప్పుడు ఆయనకు గుర్తు రావడం వెనుక ఉద్దేశ్యమేమిటన్నారు. ట్యాంకుబండుపైనున్న విగ్రహాలు ఉత్తుత్తివి కాదని, అవి మహానుభావులవని అన్నారు. వారు విగ్రహం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే దానిని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X