అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్త చరిత్ర రామ్ గోపాల్ వర్మపై పరిటాల సునీత మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Paritala Sunitha
అనంతపురం: రక్తచరిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తెలుగుదేశం శాసనసభ్యురాలు, పరిటాల రవి సతీమణి పరిటాల సునీత మండిపడుతున్నారు. సినిమాను తనకు ముందుగా చూపించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రత్యర్థి మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరిని హీరోగా చూపిస్తూ తన భర్త పరిటాల రవిని విలన్ గా చూపించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్దెలచెర్వు సూరికి ముందుగా బెంగళూర్ లో సినిమా చూపించిన వర్మ సునీతను పట్టించుకోలేదనే అభిప్రాయం ఉంది. సినిమా ఫరవా లేదని బెంగళూర్ లో గురువారం రాత్రి తన అనుచరులతో సినిమా చూసిన సూరి అన్నారు.

సినిమాపై పరిటాల రవి అనుచరులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రవి అనుచరులు అనంతపురంలోని థియేటర్లకు పెద్ద యెత్తున చేరుకున్నారు. పరిటాల రవిని ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదని వర్మ చెబుతున్నారు. రక్తచరిత్ర తొలి భాగం శుక్రవారం విడుదలైంది. రెండో భాగం నవంబర్ 19వ తేదీన విడుదలవుతోంది. తొలి భాగంతో తమకు అభ్యంతరం లేదని పరిటాల రవి అనుచరులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X