అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్త చరిత్ర సినిమా పది నిమిషాలే మిగులుతుంది: పరిటాల సునీత

By Pratap
|
Google Oneindia TeluguNews

Paritala Sunitha
అనంతపురం‌: అభ్యంతరకరమైన దృశ్యాలు తొలగిస్తే రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సినిమా పది నిమిషాలే మిగులుతుందని తెలుగుదేశం శాసనసభ్యురాలు, పరిటాల రవి సతీమణి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. పరిటాల రవి పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ నిర్మాత సి. కళ్యాణ్ తో కలిసి సోమవారం పరిటాల సునీతను కలుసుకున్నారు. పరిటాల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు. సినిమాలోని అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగిస్తే పది నిమిషాల సినిమా మాత్రమే మిగులుతుందని, రక్తచరిత్ర -2లోనైనా జాగ్రత్తలు తీసుకోవాలని, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తాను ఇదే విషయం చెప్పానని ఆమె అన్నారు. పరిటాల రవి పాత్ర పోషించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని వివేక్ ఒబెరాయ్ చెప్పారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఆయన తెలుగులో మాట్లాడారు. పరిటాల ట్రస్టుకు తన సహకారం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ కు సునీత పరిటాల రవి మెమెంటో అందించారు.

అంతకు ముందు వివేక్ ఒబెరాయ్ అనంతపురంలోని వెంకటాపురంలో పరిటాల రవి సమాధివద్దకు చేరుకుని రవికి నివాళులర్పించారు. ఒబెరాయ్ పరిటాల రవిలానే వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో నుదుట బొట్టు పెట్టుకుని అభిమానుల కోలాహలం మధ్య రవి ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. రాంగోపాల్ వర్మ పరిటాల రవి పాత్రను మలచడంలో తమకు పూర్తి అసంతృప్తిని కలిగించిందని అన్నారు. పరిటాల రవి సమాధిని సందర్శించేవారు ఎవరినైనా తాము ఘనంగా స్వాగతం పలుకుతామని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X