వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో రాజశేఖర్, జీవిత దంపతులపై అల్లు అరవింద్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై సినీ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత చేసిన ఆరోపణలపై ప్రజారాజ్యం పార్టీ నాయకుడు, చిరంజీవి బావ మరిది తీవ్రంగా మండిపడ్డారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అక్రమాలు లేవని ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. చిరంజీవి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసి ప్రజలకు దూరం చేయాలనే ప్రయత్నంలో భాగంగానే బ్లడ్ బ్యాంక్ పై బురద చల్లారని ఆయన వ్యాఖ్యానించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 60 వేల మందికి పైగా ప్రాణాలు కాపాడిందని ఆయన చెప్పారు. చిరంజీవి రాజకీయాల్లో వచ్చినప్పుడు కొన్ని పార్టీలు చేసిన సర్వేల్లో ఎక్కువ శాతం మంది చిరంజీవి వైపు మొగ్గు చూపినట్లు వెల్లడైందని ఆయన చెప్పారు.

ఎంతో మందికి ప్రాణాలు పోసిన బ్లడ్ బ్యాంక్ విశేషమైన సామాజిక ప్రయోజనాన్ని ఆశించి పెట్టిందని, సామాజిక ప్రయోజనం నెరవేర్చే కార్యక్రమాలపై చిన్న ప్రయోజనాలు ఆశించి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయేమోనని విచారణ చేయించాల్సిందిగా తాను ప్రభుత్వాన్ని కోరారని, ప్రభుత్వం ముందుకు వచ్చి ఓ స్వయం ప్రతిపత్తి గల సంస్థతో విచారణ చేయించిందని, అందులో ఏ విధమైన అక్రమాలు లేవని విచారణ తేల్చిందని ఆయన వివరించారు. దాని వల్ల కొత్త ప్రయోజనం నెరవేరిందని ఆయన అన్నారు. అర్థం లేని ఆరోపణల వల్ల విస్తృతమైన ప్రయోజనాలు ఆశించి ముందుకు వచ్చిన కార్యక్రమాలు దెబ్బ తింటాయని, అవి సమాజానికి మంచివి కావని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X