కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రక్త చరిత్ర దర్శకుడు వర్మను గాడిదన్న బంగి, ఎన్టీఆర్ వేషంలో ప్రదర్సన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ram Gopal Varma
కర్నూలు: రక్త చరిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మపై కర్నూలు తెలుగు దేశం పార్టీ నాయకుడు బంగి అనంతయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్మ నీకు బుద్ధి ఉందా, మనిషివా, గాడిదవా అంటూ వర్మపై నిప్పులు చెరిగారు. రక్త చరిత్రలో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు సినిమాలలో ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్ ను విలన్ గా చూపిస్తావా అని ప్రశ్నించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ కు సినిమాలలో చూపించిన ఎన్టీఆర్ కు ఏమైనా సంబంధముందా అన్నారు. మానవ రూపంలో ఉన్న మహానుభావుడిని నీ స్వార్థం కోసం, డబ్బు సంపాదన కోసం దిగజార్చిన నీవు మనిషివా అన్నారు.

ఎప్పుడూ వినుత్నంగా నిరసనలు తెలుపుతూ ఆకట్టుకునే తెలుగు దేశం పార్టీ నాయకుడు బంగి అనంతయ్య రాంగోపాల్ వర్మ రక్త చరిత్రపై కూడా వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్టీఆర్ వేషధారణలో వర్మ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశాడు. వెంటనే సినిమాను అపకపోతే రాష్ట్రవ్యాప్తంగా రక్తచరిత్ర నడిచే థియేటర్లలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X