రాజశేఖర్ కు షాక్: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు ప్రభుత్వం క్లీన్ చిట్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్:
చిరంజీవి
బ్లడ్
బ్యాంక్
పై
తీవ్ర
ఆరోపణలు
చేసిన
సినీ
హీరో
రాజశేఖర్,
జీవిత
దంపతులకు
ప్రభుత్వం
షాక్
ఇచ్చింది.
చిరంజీవి
బ్లడ్
బ్యాంక్
కు
క్లీన్
చిట్
ఇచ్చిది.
చిరంజీవి
బ్లడ్
బ్యాంక్
అవకతవకలకు
పాల్పడుతోందంటూ
తీవ్ర
ఆరోపణలు
చేసిన
నేపథ్యంలో
ప్రభుత్వం
చిరంజీవి
బ్లడ్
బ్యాంక్
పై
విచారణ
జరిపించింది.
బ్లడ్
బ్యాంక్
పై
వస్తున్న
ఆరోపణలపై
విచారణ
జరిపించాలని
చిరంజీవి
బావమరిది,
ప్రజారాజ్యం
పార్టీ
నాయకుడు
అల్లు
అరవింద్
ముఖ్యమంత్రి
కె.
రోశయ్యను
కోరిన
విషయం
తెలిసిందే.
ఈ
నేపథ్యంలో
జరిగిన
విచారణలో
చిరు
బ్లడ్
బ్యాంక్
లో
ఏ
విధమైన
అవకతవకలు
లేవని
ఆరోగ్య
శాఖ
మంత్రి
దానం
నాగేందర్
పేరు
మీద
సోమవారం
సాయంత్రం
ఓ
ప్రకటన
వెలువడింది.
జాతీయ
ఎయిడ్స్
నియంత్రణ
మండలి
(నాకో)
మార్గదర్శకాలకు
అనుగుణంగానే
చిరంజీవి
బ్లడ్
బ్యాంక్
నడుస్తోందని
దానం
స్పష్టం
చేశారు.
బ్లడ్
బ్యాంకులోని
రికార్డులతో
పాటు
రక్తనిధి,
సేకరణ,
నిల్వ
ఏర్పాట్లు,
పరికరాల
కొనుగోలు
ఇతర
అంశాలపై
నాకో
విచారణ
జరిపిందని,
రక్త
సేకరణ,
స్క్రీనింగ్
చార్జీల
వసూళ్లలో
దుర్వినియోగం
గానీ
నిబంధనల
అతిక్రమణలు
గానీ
లేవని
విచారణలో
తేలిందని
ఆయన
వివరించారు.