వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెనజీర్ భుట్టో హంతకులు పాకిస్తాన్ తాలిబాన్లే

By Pratap
|
Google Oneindia TeluguNews

Benazir Bhutto
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను పాకిస్తాన్ తాలిబాన్లే హత్య చేశారని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తేలింది. ఈ సంస్త తన నివేదికను ఉగ్రవాద నిరోధక కోర్టుకు అక్టోబర్ 30వ తేదీ లోగా సమర్పించే అవకాశం ఉంది. భుట్టో హత్యకు తెహ్రీక్ - ఎ - తాలిబాన్ పాకిస్తాన్ పాల్పడిందని నివేదిక తెలిపింది. టిటిడిపి చీఫ్ బైతుల్లా మెహసూద్ భుట్టో హత్యకు ప్రధాన సూత్రధారి అని ఆరోపించింది.

పాకిస్తాన్ లోని రావల్పిండిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో బెనజీర్ భుట్టో 2007 డిసెంబర్ 27వ తేదీన హత్యకు గురయ్యారు. ఓ టీనేజ్ యువకుడు భుట్టో తలపై కాల్పులు జరిపినట్లు సిసిటివి ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. పాకిస్తాన్ తాలిబాన్లే భుట్టోను హత్య చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అబ్దుర్ రెహ్మాన్, సద్దాం, ఫియాజ్ మొహ్మద్ పరారీలో ఉండడంతో ఎజెన్సీ సకాలంలో విచారణను పూర్తి చేయలేకపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X