హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేడ్చల్లో విఎమ్మార్లో ఇంజినీరింగ్ జూనియర్ విద్యార్థి ర్యాగింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rangareddy District
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని మేడ్చల్లోని విఎమ్మార్ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరోసారి బయటపడింది. కిరణ్ అనే జూనియర్ స్టూడెంట్ ని సీనియర్లు ర్యాగింగ్ చేయటమే కాకుండా కిరణపై దాడికి దిగారు. మంగళవారం తరగతి గదిలోకి వెళుతున్న జూనియర్ కిరణ్ ని సీనియర్లు పిలిచి పక్కనే జీన్స్ పాంటు వేసుకున్న అమ్మాయి జేబులో స్కేలును పెట్టి రావాల్సిందిగా ఆదేశించారు.

దానికి కిరణ్ సమ్మతించక పోవటంతో చేయి చేసుకున్నారు. కిరణ్ వెళ్లి కళాశాల ప్రిన్సిపల్ కు చెప్పటంతో ప్రిన్సిపల్ వారిని వారించాడు. అయితే తరగతి గది నుండి బయటకు వచ్చిన కిరణ్ ను మాపై ప్రిన్సిపల్ కు కంప్లయింట్ ఇస్తావా అంటూ మరోసారి ఆయనపై దాడి చేశారు. దీంతో కిరణ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కళాశాలకు వచ్చి సమాచారం సేకరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X