హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

70: 30 శాతానికి ప్రభుత్వం ఓకే: సాయంత్రం జీవో జారీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
హైదరాబాద్: ప్రభుత్వం డిఎస్సీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 70: 30 శాతం చొప్పున పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి మాణిక్య వరప్రసాద్ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేసంలో చెప్పారు. ఈ సాయంత్రం అందుకు సంబంధించిన ప్రభుత్వం చట్టం విడుదలవుతుందని అన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రోశయ్య జోక్యం లేదని ఆయన అన్నారు. కామన్ విద్యార్థులకు 70 శాతం, మెరిట్ చొప్పున 30 శాతంగా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అయితే పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వానికి సంబంధం లేదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే మేం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30,803 పోస్టులు అవసరం కాగా తొలివిడతలో 26,700 ఎస్జీటీ పోస్టులను, 1149 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. శనివారం నుండి కౌన్సిలింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై బీఇడి విద్యార్థులు అసంతృప్తితో ఉంటారని తెలుసునని అయితే వారు న్యాయం జరగలేదని అనుకుంటే కోర్టుకు వెళ్లవచ్చన్నారు. కోర్టు ఆదేశాలను మేం పాటించాం. బీఇడి వారు కావాలనుకుంటే కోర్టుకు వెళ్లి తస సమస్యను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు.

కాగా ప్రభుత్వం నిర్ణయం పట్ల బిఇడి విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ప్రభుత్వం చేసిన తప్పులకి బిఇడి విద్యార్థులు బలవుతున్నారని, ఇప్పటికై న్యాయం కోసం మేము నిరాహార దీక్షలు చేశామని అయితే ప్రభుత్వం హామీలు ఇచ్చి దీక్షలు విరమింప చేసిందని ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా బిఇడి విద్యార్థులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఇడి విద్యార్థులు సెక్రటరియేట్ ను ముట్టడించడానికి సిద్ధమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X