హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించిన ముఖ్యమంత్రి రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి కె. రోశయ్య మరోసారి ప్రశంసించారు. వైయస్సార్ ను గుండె కలిగిన నాయకుడిగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెసు అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐ సదస్సులో ఆయన శనివారం ప్రసంగించారు. వైయస్సార్ 17 విశ్వవిద్యాలయాల స్థాపనకు పూనుకున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారని, అది ఏ ముఖ్యమంత్రికి గానీ రాష్టానికి గానీ సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు. ఆ విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం సమస్యగా ఉందని ఆయన అన్నారు. విద్యార్థుల ఫీజుల రీయంబర్స్ మెంట్, ఉపకార వేతనాలకు కూడా నిధులు సర్దడం కష్టంగా ఉందని, అయితే ఇతర రంగాల నుంచి వాటికి నిధులను మళ్లిస్తున్నామని ఆయన చెప్పారు. వాటికి ఇబ్బందులు రానీయబోమని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యలన్నింటిని కూడా పరిష్కరిస్తామని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ యువతలో మార్పు తెచ్చే నాయకుడని ఆయన అన్నారు. విద్యార్థులు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని, అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెట్టాలని ఆయన అన్నారు. ఈ సదస్సులో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర రావు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొంటారని భావించారు. అయితే, ఆయన హైదరాబాదు పర్యటన రద్దయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X