వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు ధీటుగా కర్నులులో గ్రేటర్ రాయలసీమ సైనిక్ సేవా దల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayalaseema vs Telangana
కర్నూలు: తెలంగాణ వాదులు హింసాత్మక సంఘటనలకు పూనుకుంటున్నందున నవంబర్ 7 వ తేదిన గ్రేటర్ రాయలసీమ సైనిక్ సేవా దల్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కర్నులు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణవాదులు హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తగలబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణవాదులు హద్దులు మీరి దాటుతున్నందుల్లే రాయలసీమలో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇకనుండి ఎవరైనా పొట్టి శ్రీరాములు విగ్రహంపైన గానీ, సీమాంధ్రులపైన గానీ చెయ్యి వేస్తే ఆ చెయ్యి తీసేస్తారని, దానికి తెలంగాణ నాయకులే బాధ్యత వహించాలని అన్నారు.

కాగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొందరు దుండగులు శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేయటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు, సీమాంధ్రకు పొట్టి శ్రీరాములు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇందులో ఎలాంటి సంబంధం లేని, తెలుగు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన ఒక అమరజీవి విగ్రహాన్ని కూల్చటం తెలంగాణవాదులు కుంచితత్వాని, దుర్మార్గానికి నిదర్శనమన్నారు.తెలంగాణ నాయకులు కూడా వారిని ఆపకపోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X