వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన వనపర్తి కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pawan kalyan
మహబూబ్ నగర్: చిత్ర నటుడు, ప్రజారాజ్యం అధ్యక్షుడు మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గతంలో మూడుసార్లు విచారణ నిమిత్తం పవన్ కళ్యాణ్ కోర్టుకు హాజరు కానందున ఈ నాన్ బెయిలబుల్ వారెంటును వనపర్తి కోర్టు జారీ చేసింది.

2008లో పవన్ కళ్యాణ్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో ఆయన కాంగ్రెస్ నాయకులను గుడ్డలూడదీసి కొట్టాలి అని అభ్యంతర వాఖ్యలు చేశాడు. దీంతో పవన్ ప్రచారంలో ఆభ్యంతరకర వాఖ్యల చేశారంటూ స్థానిక కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమార్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. అయితే ఇప్పటికి మూడు సార్లు కోర్టు కేసు విచారణ జరిగినా పవన్ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. పవన్ ఎంతకీ స్పందించక పోవటంతో కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. కాగా కోర్టునుండి ఆదేశాలు రాగానే పోలీసులు పవన్ కళ్యాణ్ అరెస్టుకు చేయడానికి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. కోర్టు ఇవ్వాలే పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తే మంగళవారం ఉదయం వనపర్తి పోలీసులు హైదరాబాద్ చేరుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X