హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొన్నాల ఉత్తర కుమారుడు: గాలి ముద్దు కృష్ణమనాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు మంగళవారం ఆరోపించారు. భారీ నీటీ పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఉత్తర కుమారుడిలా ఉన్నాడన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇరిగేషన్ విషయంలో రాష్ట్రానికి ఒక్క లాభం కూడా జరగలేదని, కాంగ్రెస్ వారు దోచుకోవడానికే సరిపోయిందన్నారు.

ఇరిగేషవ్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. పోలవరంపై ఎన్విరాన్ మెంట్ అనుమతికి ఎన్ని లేఖలు రాసినా లాభం లేదన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. మంత్రులు, శాసనసభ్యులు కూడా కనిపించడం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X