హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ నటుడు అశోక్ కుమార్ ఇంట్లో రూ.50 లక్షల దొంగతనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఓ నటుడి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. సోమవారం అర్థరాత్రి సమయంలో జూబ్లీబీల్స్ లోని ఫిలింనగర్లో ఉంటున్న కొల్లా ఆశోక్ కుమార్ అనే నటుడి ఇంటిలో ఉన్న రూపాయలు 50 లక్షల విలువైన నగదును, బంగారాన్ని కొందరు దొంగలు దోచుకెళ్లారు. అందులో 10 లక్షలు రూపాయల నగదు, 40 లక్షల రూపాయల బంగారం ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. వెనుక తలుపును పగులగొట్టి దొంగలు దోచుకెళ్లినట్టు తెలిస్తుంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు.

బాధితులు తమ ఇంట్లో దొంగతనం జరిగినట్లు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. అయితే ఇంట్లో అంత డబ్బు ఉన్నదన్న విషయం ఎవరికి తెలుసనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. తెలిసిన వ్యక్తులు గానీ, తెలిసిన వ్యక్తుల ద్వారా విషయం తెలుసుకున్న వారెవరైనా ఈ దొంగతనానికి పాల్పడవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం నుండి దొంగతనం జరిగే వరకు అశోక్ కుమార్ ఇంటికి ఎవరు వచ్చి వెళ్లారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్ వేలి ముద్రలు సేకరిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X