హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రహేజా ఐటి పార్కు కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంటు సోదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Raheja IT Park
హైదరాబాద్: హైదరాబాదులోని రహేజా ఐటి పార్కు కార్యాలయాలపై విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంటు అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. హైదరాబాదు ఘట్కేసర్, మాదాపూర్ ల్లో గల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఎపిఐఐసితో రహేజా ఐటి పార్కు అక్రమ ఒప్పందం కుదుర్చుకుందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు 50 మంది ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో కీలకమైన పత్రాలు లభించినట్లు సమాచారం. రహేజా ఐటి పార్కు సంస్థ ఒప్పందాల ఉల్లంఘనకు పాల్పడిందా, లేదా అనేది మాత్రమే తాము చూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

రహేజాకు మాదాపూర్ లో ఎపిఐఐసి 50 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున 60 కోట్ల రూపాయలకు 110 ఎకరాల భూమిని అప్పగించింది. ఆ భూమి విలువ 600 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇందులో 15 ఐటి సంస్థలున్నాయి. ఈ స్థలాలను ఐటి సంస్థలకు మాత్రమే రహేజా కేటాయించాల్సి ఉంటుంది. అయితే, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా రహేజా స్థలాలను కేటాయించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X