వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌత్ కరోలినా తొలి మహిళా గవర్నర్ గా ఇండియన్ అమెరికన్ చరిత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Nikki Haley
వాషింగ్టన్‌: సౌత్ కరోలినా తొలి మహిళా గవర్నర్ గా ఎన్నికై ఇండియన్ అమెరికన్ నిక్కీ హేలీ చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు చెందిన డెమొక్రటిక్ పార్టీని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ ఓడించారు. సిక్కు దంపతులకు జన్మించిన నిక్కీ హేలీ పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అమెరికాలో గవర్నర్ గా ఎన్నికైన రెండో ఇండో - అమెరికన్ నిక్కీ హేలీ. ఇంతకు ముందు బాబీ జిందాల్ లూసియానా గవర్నర్ గా ఎన్నికయ్యాడు.

హేలీకి 52 శాతం ఓట్లు రాగా, ఆమె సమీప డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి విన్సెంట్ షీహాన్ కు 46 శాతం ఓట్లు వచ్చాయి. చివరి వరకు విజయం హేలీతో దోబూచులాడుతూ వచ్చింది. కొన్ని సార్లు వెనకబడిపోయారు కూడా. పోటీ హోరాహోరీ జరిగింది. రికార్డు స్థాయిలో ఆరుగురు ఇండో - అమెరికన్లు పోటీలో ఉన్నారు. వారిలో ఐదుగురు డెమొక్రాట్లు. మధ్యంతర ఎన్నికలు ఒబామా డెమొక్రాట్ పార్టీకి ఎదురు దెబ్బనే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X