హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అల్లు అర్జున్ , స్నేహారెడ్డిల పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Allu Arjun
హైదరాబాద్: అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డితో సినీ హీరో అల్లు అర్జున్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని త్వరలో అర్జున్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. అయితే దానిపై అల్లు అర్జున్ తండ్రి చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ భగ్గుమన్నారు. అయితే గురువారం అల్లు ఫ్యామిలీ, స్నేహారెడ్డి కుటుంబంతో సంప్రదింపులు జరిపింది. ఇందులో ఇరువర్గాల మధ్య సయోద్య కుదిరింది. ఇరువర్గాలు పెళ్లికి అంగీకరించాయి. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది. అయితే వీరి పెళ్లికి ఇరువర్గాలు అంగీకరించటంతో ఇక ముహూర్తమే తరువాయి. ముహూర్తం ఎప్పుడు అనేది త్వరలో తెలుస్తుంది.

కాగా అల్లు అరవింద్ పెళ్లిపై స్పందించారు. అల్లు అర్జున్ ది ప్రేమ పెళ్లి కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమే అని చెప్పారు. అర్జున్ ఇప్పుడు బద్రీనాథ్ చిత్రీకరణలో ఉన్నాడని, జనవరిలో అది పూర్తవుతుందని ఆ తర్వాత పెళ్లి ఉంటుందన్నారు. త్వరలో ముహూర్తాలు పెట్టుకుంటామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X