హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళారాజ్యం అధ్యక్షురాలిగా చిరంజీవి కూతురు శ్రీజ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Srija
హైదరాబాద్: ప్రజారాజ్యం అనుబంధ మహిళా సంఘం మహిళారాజ్యానికి చిరంజీవి కూతురు శ్రీజ నేతృత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల చిరంజీవి కుటుంబానికి దగ్గరైన శ్రీజ మహిళారాజ్యానికి నాయకత్వం వహించేందుకు సిద్ధపడుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మహిళా రాజ్యం నాయకులతో చిరంజీవి పూర్తిగా విసిగిపోయి ఉన్నారని, ఈ స్థితిలో శ్రీజకు దాని పగ్గాలు అప్పగించాలని అనుకుంటున్నట్లు సమాచారం. మహిళారాజ్యం నాయకులు శోభారాణి, వాసిరెడ్డి పద్మ పరస్పరం విమర్శించుకుంటుండడం ఆయనకు తలనొప్పిగా పరిణమించినట్లు భావిస్తున్నారు.

శ్రీజకు రాజకీయ నాయకురాలికి ఉండాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నట్లు బావమరిది అల్లు అరవింద్ చిరుకు చెప్పినట్లు భోగట్టా. ఈ నేపధ్యంలోనే ఇటీవల శ్రీజ, రాంచరణ్ తేజ "ఆరెంజ్" సినిమా ఆడియో ఫంక్షన్‌కు చిరు దంపతులతో ప్రత్యక్షమైందని చెపుతున్నారు. తండ్రిని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ ముఖాన్ని సైతం చూసేందుకు అంగీకరించని చిరంజీవి, చివరికి కుమార్తెను మన్నించినట్లు సమాచారం. తనకు ప్రసంగ పాటవం ఉందని శ్రీజ తండ్రి వద్ద నిరూపించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X