వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ జిల్లాలో వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరికారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nalgonda
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను జిల్లాలోని పలు ప్రాంతాల్లో విసిరేశారు. ఈ హత్య తీరు జిల్లాలోని ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. వ్యక్తి తల నల్లగొండ జిల్లాలోని ప్రకాశం జిల్లాలో దొరికింది. కాళ్లు, చేతులు, తల లేని మొండెం దేవరకొండలో పోలీసులకు దొరికింది. కాళ్లూ చేతులు వేర్వేరు ప్రాంతాల్లో దొరికాయి. శరీరభాగాలు నల్లగొండ జిల్లాలోని ఎనిమిది పోలీసు స్టేషన్ల పరిధిలో పడి ఉన్నాయి.

హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. ఆ వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్యకు కారణాలు గానీ హంతకులు ఎవరనేది గానీ తెలియడం లేదు. హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది తెలిస్తే తప్ప హంతకులు ఎవరనేది గుర్తించడం సాధ్యం కాదని పోలీసులు అంటున్నారు. అప్పుడే హత్యకు కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు. ఆస్తి తగాదాలేమైనా హత్యకు కారణమై ఉండవచ్చునా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X