వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన రాజకీయ నేతలపై బరాక్ ఒబామా ద్వేషం పెంచారా?

By బిజి మహేష్
|
Google Oneindia TeluguNews

Barack Obama
న్యూఢిల్లీ: గత మూడు రోజులుగా బరాక్ ఒబామా భారత మీడియాను ఆక్రమించేశాడు. ఒబామా వార్తలకు ఆంగ్ల టీవీ చానెళ్లే కాకుండా ప్రాంతీయ చానెళ్లు, వార్తాపత్రికలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఒబామా తన సతీమణి మిషెల్లీతో కలిసి ఆదివారం ముంబైలోని హోలీ నేమ్ స్కూల్ ను సందర్శించారు. దీపావళి సందర్భంగా ఏర్పాటైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ విద్యార్థినులతో కలిసి మిషెల్లీ నృత్యం చేయడానికి ఏ మాత్రం వెనకాడలేదు. వారితో కలిసి మిషెల్లీ నృత్యం చేశారు. ఒబామా కాస్తా వెనకాడినప్పటికీ ఆ తర్వాత విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. తమతో కలిసి వారిద్దరు డ్యాన్స్ చేయడం విద్యార్థులకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రేరణను అందించింది.

మన రాజకీయ నాయకులు మాతో ఎందుకు సులభంగా కలిసిపోరని ట్విట్టర్ లో భారతీయులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఇందిరా గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఆదివాసీలతో కలిసి నృత్యాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ ఫొటోలు మనకు ఇప్పటికీ దొరుకుతాయి. అదే ఆఖరు కావచ్చు. అయితే, తమ అడుగులకు మడుగులొత్తాలని, వారి మాటలకు అనుగుణంగా మనం ఆడాలని రాజకీయ నాయకులు ఇప్పుడు కోరుకుంటున్నారు.

ఆ తర్వాత ఒబామా సెయింట్ జేవియర్ కళాశాలకు వెళ్లారు. టౌన్ హాల్ మీటింగ్స్ విషయంలో బిల్ క్లింటన్, ఒబామాలకు వెన్నతో పెట్టిన విద్య. ఇండియన్ యూనివర్శిటీలో భారత్ లో మీడియా, ప్రేక్షకులు, పౌరులు ఆసక్తిగా చూడడానికి ముందుకు వచ్చారు. మిషెల్లీ ప్రారంభోపన్యాసం చేశారు. ఒబామాను చాలా కష్టమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని ఆమె విద్యార్థులకు సూచించారు. సెయింట్ జేవియర్ కళాశాలలో ఒబామా 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ఆయన వందలాది ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఒబామాను అలా ఎందుకు భావించాలంటే మన రాజకీయ నాయకులు అటువంటి దాన్ని ఇష్టపడరు. ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్లు దగ్గరికి వస్తారు. సమస్యలపై విన్నవించుకోవడానికి కూడా అందుబాటులో ఉండరు. టౌన్ హాల్ మీటింగ్ తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలతో ఒబామా కరచాలనం చేశారు. ఆయన భద్రతా సిబ్బంది దూరాన్ని పాటించారు. బ్రాండ్ బిల్డింగ్ ప్రాసెస్ లో వాళ్లు జోక్యం చేసుకోలేదు. భారత సెక్యురిటీ సిబ్బంది రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య సంభాషణను, పరస్పర కలయికను అడ్డుకుంటారు. పాశ్చాత్య, భారత రాజకీయ నాయకులతో కలిసి విషయంలో కూడా మన భారతీయలం కూడా భిన్నంగా ప్రవర్తిస్తామా, కావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X