వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాతో రాజకీయ జీవితం అంతం కాదు: అశోక్ చవాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ashok Chavan
ముంబై: రాజీనామాతో రాజకీయ జీవితం అంతం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అశోక్ చవాన్ అన్నారు. ఆదర్శ్ కుంభకోణం వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు రావటంతో సోనియా గాంధీ ఆయనను ముఖ్యమంత్రిగా తన రాజీనామాను గవర్నర్ కు అందజేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆయన మంగళవారం తన రాజీనామాను గవర్నర్ ఆమోదానికి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తన రాజకీయ జీవితం ఇంకా ఉందని, కాంగ్రెసు నియమాలకు కట్టుబడి ఉన్నానని, అందుకే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు త్వరలో తొలగిపోయి క్లీన్ చిట్ తీసుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. సోనియాగాంధీపై నాకు నమ్మకం ఉందని అన్నారు. ఆదర్శ్ కుంభకోణంలో నాపై ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమయినప్పటికీ అందులో నా పాత్ర లేదని, ఆ కుంభకోణంలో నాకు ఎలాంటి పాత్ర లేదన్నారు.

కాగా అశోక్ చవాన్ రాజీనామాను చేయటంతో ఆయన స్థానంలో పార్టీ అధిష్టానం మంగళవారం సాయంత్రం లోగా మరొకరిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలని చూస్తుంది. మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశముఖ్, సుశీల్ కుమార్ షిండే, ముఖుల్ వాసిని తదితరులు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. పార్టీ అధిష్టానం వారి పేర్లను పరిశీలిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X