వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర సిఎం అశోక్ చవాన్ రాజీనామాను ఆమోదించిన సోనియా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామాను ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించింది. ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని ద్విసభ్య కమిటీ ఆదర్శ్ కుంభకోణం వ్యవహారంలో అశోక్ చవాన్ ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందకపోవడంతో సోనియాగాంధీ ఆయన రాజీనామాను ఆమోదించింది. అశోక్ తన రాజీనామాను గవర్నర్ కు పంపాల్సిందిగా ఏఐసిసి ఆదేశించింది.

ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు ఉద్దేశించిన ఫ్లాట్లలో తన అత్తకు ఫ్లాట్ ఇప్పించారని అశోక్ చవాన్ ఆరోపణలు ఎదుర్కున్నారు. దీంతో ఇటీవల అశోక్ చవాన్ ను సోనియా ఢిల్లీకి పిలిపించారు. చవాన్ తన రాజీనామా లేఖను సోనియాకు సమర్పించారు. వారం రోజుల క్రితమే సోనియా అశోక్ చవాన్ రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన వల్ల చవాన్ తప్పుకోవడానికి కొంత గడువు ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X