వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Prithviraj Chavan
న్యూఢిల్లీ: మాహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్ పగ్గాలు చేపట్టనున్నారు. ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో అశోక్ చవాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రిగా వెళ్లనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ పేరును కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖరారు చేశారు. పృథ్వీరాజ్ చవాన్ బుధవారం ఉదయం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఆయన కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీలను కూడా కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్ పేరును ఆ తర్వాత ఎఐసిసి బుధవారం ఉదయం ప్రకటించింది.

అశోక్ చవాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త నేత ఎన్నిక కోసం కాంగ్రెసు శాసనసభ్యులు మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎఐసిసి ప్రతినిధులుగా ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ హాజరయ్యారు. దాదాపు గంట పాటు సాగిన సమావేశం తమ నేత ఎంపిక నిర్ణయాధికారాన్ని సోనియాకు అప్పగించింది. ఆదర్శ్ స్కామ్ పై ప్రజల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రిని మార్చక తప్పడం లేదని ప్రణబ్ ముఖర్జీ శాసనసభ్యులకు చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు విస్మరించలేవని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X