హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూత్ కాంగ్రెసులో జగన్ క్యాంప్ భర్తీపై రాహుల్ గాంధీ సీరియస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
హైదరాబాద్: టాలెంట్ హంట్ పేరుతో తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందినవారిని యూత్ కాంగ్రెసులో నింపిన వైనంపై ఎఐసిసి ప్రధాన కార్యదర్సి రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నించేందుకు యూత్ కాంగ్రెసు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబును రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. యూత్ కాంగ్రెసు కార్యదర్శి జితేందర్ సింగ్ సుధాకర్ బాబును ఢిల్లీకి రావాలని మంగళవారం పిలిచారు. యూత్ కాంగ్రెసు రాష్ట్ర కమిటీని, జిల్లా అధ్యక్షులను నియమిస్తూ ఇటీవల యూత్ కాంగ్రెసు నాయకత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ కమిటీ నియామకంపై అఖిల భారత యూత్ కాంగ్రెసు వెంటనే స్టే ఇచ్చింది.

వైయస్ జగన్ వర్గానికి చెందినవారినే ఎక్కువగా రాష్ట్ర కమిటీలో వేశారని, జిల్లా అధ్యక్ష పదవులు కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ విషయం తన దాకా రావడంతో నియామకాలపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నియామకాలపై వివరణ కోరి, సరైన దిశానిర్దేశం చేసేందుకు సుధాకర్ బాబును రాహుల్ గాంధీని ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X