హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వెంటే ఉంటా, బెదిరింపులకు భయపడ: రెహ్మాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తాను కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంటే ఉంటానని, బెదిరింపులకు భయపడబోనని మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ స్పష్టం చేశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన హైదరాబాదులోని నారాయణగుడా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తనకు ఏదైనా జరిగితే కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులదే బాధ్యత అని ఆయన అన్నారు. తాటాకు చప్పుళ్లకు తాను బెదరబోనని ఆయన అన్నారు. ఈ దొర తెలంగాణ తమకు వద్దని ఆయన కెసిఆర్ ను ఉద్దేశించి అన్నారు. కెసిఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X