రాజా రాజీనామాకు దారితీసిన టెలికం స్కామ్ ఏమిటి?

ఆగస్టు28, 2007: 'స్పెక్ట్రమ్' లైసెన్స్‌లను మార్కెట్ ధరలకు అనుగుణంగా పోటీ బిడ్డింగ్ ద్వారా కేటాయించాలని ట్రాయ్ సిఫార్సు. తిరస్కరించిన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ. 2001 విధానా న్నే అనుసరిస్తామని, ముందు వచ్చిన వారికి ముం దు ప్రాతిపదికన మంజూరు చేస్తామని ప్రకటన.
సెప్టెంబర్ 20, 2007: రాజా కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న, సన్నిహిత సంస్థలైన యూనిటెక్, లూప్, డాటాకామ్, స్వామ్ కంపెనీలు స్పెక్ట్రమ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు.
జనవరి 1-10. 2008: డీఓటీ కార్యదర్శిగా నియమితులేన సిద్ధార్థ బెహూరా.. లైసెన్స్‌ల కేటాయింపు ప్రక్రియను మంత్రుల గ్రూప్‌కు నివేదించాలనే న్యాయశాఖ సూచనను పట్టించుకోకుండా 10 రోజుల్లో 9 కంపెనీలకు లైసెన్స్‌లు మంజూరు.
నవంబర్ 15, 2008: కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖకు సీవీసీ షోకాజ్ నోటీసు జారీ. ఈ కుంభకోణంపై విచారణ అనంతరం,రాజాను ప్రాసిక్యూట్ చేయాలని ప్రధానికి సిఫార్సు.
అక్టోబర్ 21, 2009: సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు.
ఏప్రిల్ 28, 2010: ఈ కుంభకోణంలో రాజా పాత్రను విశదం చేస్తూ మీడియాలో వీడియో టేపుల ప్రసారం.
రూ.10,800 మొత్తాన్ని చెల్లించి 9 కంపెనీలు లైసెన్స్ లు పొందాయి. వీటిలో రాజా కుటుంబ సభ్యులు భాగస్వామ్యమున్న, సన్నిహిత సంస్థలు నాలుగు ఉన్నాయి. లైసెన్స్ కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వం రూ.1.4 నుంచి 1.76 లక్షల కోట్లను నష్టపోయిందని కాగ్ నివేదిక. న్యాయ శాఖ, ఆర్థిక శాఖ సూచనలను పెడచెవిన పెట్టిన రాజా ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్న కాగ్.












Click it and Unblock the Notifications