హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినీతి ఐఏఎస్ లపై చర్యలేవి: భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: అవినీతి అరోపణలు వచ్చిన ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, శ్రీలక్ష్మి, జగన్మోహన్, వెంకటరామిరెడ్డి, ఐఏఎశ్ అధికారిణి తేజ్ దిప్ కౌర్ లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరపేట శాసనసభ్యుడు గంగారపు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పలువురు మంత్రులు, శాసనసభ్యులకు ఈ అధికారులతో పాటు అక్రమాలలో భాగస్వామ్యం, సాన్నిహిత్యం ఉండటం వల్లనే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోలేక పోతుందన్నారు. ముఖ్యమంత్రి పేషీలో ఫైలు ఉన్నప్పటికీ దాన్ని రోశయ్య పరిశీలించకపోవటం విడ్డురమన్నారు.

ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, శ్రీలక్ష్మి, జగన్మోహన్, వెంకట్రామిరెడ్డి, ఐపీఎస్ ఆఫీసర్ తేజ్‌దీప్ కౌర్‌ల ఉదంతాలే నిదర్శనమని, వీరిలో జగన్మోహన్, వెంకట్రామిరెడ్డి మాత్రం కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లు అని, గత ఐదేళ్లలో ఈ ఐదుగురిపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయని, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకోవడం నుంచి అవినీతి చర్యలకు పాల్పడటందాకా అనేక అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైందని ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం అచ్చయింది. ఆ ఐఎఎస్ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలేమిటనేది కూడా ఆ పత్రిక బయటపెట్టింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X