• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అక్రమ సంబంధం కారణంగా తిరుపతి, మహబూబ్ నగర్లో ఇద్దరు బలి

By Srinivas
|

Mahaboobnagar District
మహబూబ్ నగర్\తిరుపతి: మహబూబ్ నగర్ జిల్లా బొమ్రాసుపేట మండలం జూగ్నంపల్లి గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మొగులయ్య అనే వ్యక్తిని కొట్టి చంపారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం రాఘవాపూర్ కు చెందిన మొగులయ్యను మంగళవారం అర్ధరాత్రి జూగ్నంపల్లి గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టి చితకబాదారు. వాటిని తట్టుకోలేక బాధితుడు చనిపోయాడు. గ్రామంలోని ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే వారు కొట్టినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

అలాంటి సంఘటనే తిరుపతి పట్టణంలోనూ చోటు చేసుకుంది. పట్టణంలోని శివజ్యోతినగర్లో ఓ దుకాణంలో కృష్ణమూర్తి అనే వ్యక్తిని సజీవ దహనం చేశారు. కృష్ణమూర్తి ఓ కాంట్రాక్టరు వద్ద పని చేస్తున్నాడు. ఇతడు కాంట్రాక్టరు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ బంధువులు మంగళవారం రాత్రి ఉద్యోగం నుండి వచ్చి దుకాణంలో నిద్రించాడు. ఆ సమయంలో అతన్ని సజీవ దహనం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X