వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ బాస్ కు బొంబాయి హైకోర్టు ఊరట: ప్రభుత్వ ఆదేశాలపై స్టే

By Pratap
|
Google Oneindia TeluguNews

Bigboss logo
ముంబై: వివాదస్పద 'బిగ్‌బాస్" రియాలిటీ షోను రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ జారీ చేసిన ఆదేశాలపై బాంబే హైకోర్టు గురువారం స్టే విధించింది. దీంతో బిగ్ బాస్ షోకు ఊరట లభించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. బిగ్‌బాస్, రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమాలను ఇకపై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని కేంద్రం బుధవారం ఆదేశించింది. దీంతో బిగ్‌బాస్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న కలర్స్ చానల్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు స్టేతో బిగ్ బాస్ రియాల్టీ షో యథావిధిగా రాత్రి 9 గంటలకే ప్రసారమవుతుంది. బిగ్ బాస్ రియాల్టీ షోలో అశ్లీలత చోటు చేసుకుందనే ఆరోపణపై సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ దాని ప్రసార సయమాన్ని మార్చాలని ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X