వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్ప్ - కార్ప్. కామ్: 30 సెకన్లలో జాబ్, అభ్యర్థి మ్యాచింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Corp Logo
సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు ప్రపంచాన్ని చుట్టుముట్టిన కాలంలో కూడా వేలాది మంది అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కార్ప్- కార్ప్ డాట్ కామ్ సంస్థ విజయం సాధించింది. 2007లో వర్జీనియా కేంద్రంగా ఏర్పడిన ఈ టెక్నాలజీ సంస్థ ఉద్యోగాలను ఆశిస్తున్న అభ్యర్థులను సరైన ఉపాధి అవకాశాలు కల్పించేవారితో ప్రత్యేకమైన ఫెచ్ టెక్నాలజీ సహాయంతో 30 సెకన్ల లోపలే కలపడంలో విజయం సాధిస్తోంది. ఉద్యోగార్థులకు ఉపాధి కల్పించేవారి కోసం, రిక్రూటర్లు అభ్యర్థుల కోసం పని కట్టుకుని అన్వేషించాల్సిన అవసరం లేకుండా వారిని వర్చ్యువల్ అసిస్టెంట్ వంటి సాయంతో ఆటోమేటిక్ గా ఈ సిస్టం వారిని కలుపుతుంది. ఎంప్లాయర్ తగిన అభ్యర్థి కావాలనుకుంటే తన రిక్రూట్ మెంట్ ను పోస్టు చేయాల్సి ఉంటుంది. సిస్టం సెర్చ్ చేసి విశ్లేషించి, షార్ట్ లిస్టు చేసి నోటిఫై చేస్తే 30 సెకన్ల లోపలే పది తగిన ఉత్తమ అభ్యర్థులను చూపిస్తుంది. ఆ రకంగా ఎంప్లాయర్లు, ఉద్యోగార్థుల అన్వేషణ ప్రక్రియను పూర్తిగా తొలగిస్తుంది. 'మా సిస్టం ప్రతి రోజూ 30 శాతం నియామకం సమయాన్ని ఆదా చేస్తుంది. నేటి మార్కెట్లో అది ఎంతో అవసరం'' అని కార్ప్ - కార్ప్ సిఇవో ప్రభాకరన్ మురుగయ్య చెప్పారు.

తగిన అభ్యర్థులు చేరి, వారిని వాడుకుని, అభ్యర్థుల సమయాన్ని తగ్గిస్తే ఐటి వర్క్ ఫోర్స్ ఉత్పాదక సామర్థ్యం 20 శాతం పెరుగుతుందని, దాంతో పాటు క్లయింట్ల అవసరాలు తీర్చి, ప్రాజెక్టును కట్ షార్ట్ చేసి, కంపెనీ బాటమ్ లైన్ అభివృద్ధి చెందుతుందని మురుగయ్య అన్నారు. 50 మంది ఉద్యోగాలున్న సంస్థ ఉత్పాదక సామర్థ్యం పది శాతం పెరుగుతుందని, వార్షిక రెవెన్యూలో 5 లక్షల డాలర్ల పెరుగుదల ఉంటుందని ఆయన చెప్పారు. లఘు వ్యాపారవేత్తల సాధికారిత కోసం కార్ప్ - కార్ప్ డాట్ కామ్ అమెరికావ్యాప్తంగా ఐటి కన్సల్టింగ్ కంపెనీల కోసం విజయవంతంగా 20 కాన్ఫరెన్స్ లు నిర్వహించింది.

తాత్కాలిక ప్రాతిపదికపై ఉన్న వనరులను బదలాయించుకోవడానికి కంపెనీలను సమీకృతం చేయడం ద్వారా కార్ప్ - కార్ప్ డాట్ కామ్ క్లయింట్ల జాబితాలో 6 వేల కంపెనీలకు పైగా నమోదు చేసుకున్నాయి. ప్రతి నెలా వెబ్ సైట్ 30 వేలకు పైగా కొత్త కాంట్రాక్టు ఉద్యోగాలు పొందుతున్నాయి. ఆర్థిక మాంద్యం నెలకొన్న స్థితిలో కూడా కంపెనీ ప్రతి క్వార్టర్ లో సంస్థ విశిష్టమైన పెరుగుదలను సాధించింది. వినూత్నమైన టెక్నాలజీ ద్వారా తమ సంస్థ విజయపథంలో సాగుతోందని మురుగయ్య చెప్పారు. ఆ టెక్నాలజీ ద్వారా సంస్థ మంచి ఫలితాలను సాధిస్తోందని, కస్టమర్లను సంతృప్తి పరచగలుగుతోందని, అనుభవజ్ఞులైన ఉద్యోగాలూ కస్టమర్ల ప్రయోజనాల దృష్టితో ముందుకు సాగుతోందని వివరించారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా తన సత్తాను చాటడానికి కార్ప్ - కార్ప్ డాట్ కామ్ ప్రణాళికను అమలు చేయబోతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X