విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భగ్గుమన్న సీమాంధ్ర: రేపు బంద్ కు విద్యార్థుల జెఎసి పిలువు

By Pratap
|
Google Oneindia TeluguNews

United Andhra
విజయవాడ: ఎస్సై రాతపరీక్షల వాయిదాపై సీమాంధ్ర వర్గాలు భగ్గుమంటున్నాయి. సీమాంధ్ర ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పరీక్షల వాయిదాకు నిరసనగా సీమాంధ్ర విద్యార్థుల జెఎసి రేపు (శనివారం) విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. ఎస్సై రాత పరీక్షలను రద్దు చేసినట్లు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ధర్నాకు దిగారు. రాస్తోరోకో నిర్వహించారు.

అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర విశ్వవిద్యాలయం (ఎస్కేయు) విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయు) విద్యార్థులు కూడా ఆందోళనకు దిగారు. ఎస్సై పరీక్షల వాయిదాకు నిరసనగా సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్సై రాత పరీక్షల వాయిదాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు తీవ్రంగా ప్రతిస్పందించారు. రోశయ్య పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర పరిరక్షణ సమితి రేపు శనివారం సీమాంధ్ర బంద్ కు పిలుపునిచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X