విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మంత్రి సబితను బర్తరఫ్ చేయాలి: సీమాంద్ర విద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
విజయవాడ: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు డిమాండులకు తలొగ్గి ప్రభుత్వం ఎస్ఐ పరీక్షలు వాయిదా వేయడాన్ని తాము నిరసిస్తున్నట్టు కాంగ్రెస్ శాసనసభ్యుడు జోగి రమేష్ అన్నారు. ప్రభుత్వం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ఠ్యా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తున్నప్పటికీ పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే ఎస్ఐ పరీక్ష వాయిదా నిర్ణయానికి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతామన్నారు. అయితే మా నిరసన శాంతియుతంగా ఉంటుందన్నారు.

ప్రభుత్వం రాత పరీక్షలను వాయిదా వేయడం దురదృష్టకరమని సీమాంధ్ జెఏసి నాయకుడు శ్యామ్యూల్ అన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. విద్యార్థుల వయసు ముగిసిపోతున్నందున ప్రభుత్వం వెంటనే తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే సీమాంధ్ర విద్యార్థుల తడాఖా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఎస్ఐ అభ్యర్థుల జీవితాలలో ప్రభుత్వం నిప్పులు పోస్తుందన్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు తెలంగాణ వారు పూనుకుంటే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నిర్ణయం హింసను ప్రోత్సహించే విధంగా ఉందన్నారు.

ఎస్ఐ పరీక్షల వాయిదా పట్ల సీమాంధ్ర యువత, విద్యార్థిలోకం అగ్గిమీద గుగ్గిలం అయింది. తెలంగాణకు చెందిన హోంమంత్రి సబితారెడ్డి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు ప్రకటిస్తుందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వంనుండి ఆమెను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉద్రిక్తంగా ఉన్నప్పుడు అక్కడ పరీక్షలు వాయిదా వేయండి. కాని సీమాంధ్రలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. డిసెంబర్ 18వ తారీఖుల ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X