వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ బాస్ అసభ్యతకు గాను సల్మాన్ ఖాన్ పై ఉత్తరప్రదేశ్ లో కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Salman Khan
లక్నో: బిగ్ బాస్ 4 రియాల్టీ షోలో అసభ్యత చోటు చేసుకుందనే ఆరోపణపై ఉత్తరప్రదేశ్ కోర్టులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై కేసు నమోదైంది. ఆ రియాల్టీ షో నిర్మాత, దర్శకుడు, కొంత మంది పోటీదారులపై కూడా కేసు నమోదైనట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా కోర్టులో వారిపై ఈ కేసు నమోదైంది.

అలీగఢ్ కు చెందిన అనూప్ కౌశిక్ అనే న్యాయవాది చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆ కేసును దాఖలు చేశారు. అనూప్ కుమార్ శుక్రవారం బిగ్ బాస్ పై ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షోను ప్రసారం చేస్తున్న చానెల్ మేనేజింగ్ డైరెక్టర్, షో దర్శక నిర్మాతలపై ఫిర్యాదు చేసినట్లు అనూప్ కౌశిక్ చెప్పారు. కేసు విచారణను కోర్టు నవంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X