విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్సై పోస్టుల పరీక్షపై ప్రభుత్వానికి సీమాంధ్ర విద్యార్థుల డెడ్ లైన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sri Venkateswara University
విజయవాడ: ఎస్సై పరీక్షలను యథతథంగా నిర్వహించాలని పట్టుబడుతున్న సీమాంధ్ర విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. పరీక్షల వాయిదాను రద్దు చేసుకుని, పరీక్షలను నిర్వహిస్తామని సోమవారంలోగా ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రం అగ్ని గుండమవుతుందని వారు హెచ్చరించారు. తమ ఆందోళనకు మద్దతు తెలపాలని వారు సీమాంధ్ర మంత్రులకు, శాసనసభ్యులకు విజ్ఞప్తులు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఓ పది మంది విద్యార్థులకు ప్రభుత్వం లొంగిపోయిందని సీమాంధ్ర జెఎసి కన్వీనర్ శామ్యూల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుట్రతో పది మంది విద్యార్థులకు ప్రలోభాలకు లొంగిపోయి ఆందోళనకు దిగారని ఆయన విమర్శించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ పది మంది విద్యార్థులు 12 బస్సులు ధ్వంసం చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే సాకు చూపారని ఆయన అన్నారు. సీమాంధ్ర విద్యార్థుల సహనాన్ని అసమర్థతగా భావించవద్దని ఆయన అన్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో లా పరీక్షలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయం గేట్లు మూసేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X