వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం సబితా ఇంద్రారెడ్డి vishakapatnam si posts andhra university sabitha indra reddy
ఎస్ ఐ పరీక్షలు నిర్వహించాల్సిందే: ఏయులో మూడో రోజుకు దీక్షలు

ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ విద్యార్థి సంఘాల డిమాండుకు తలొగ్గి వేలమంది అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దన్నారు. తెలంగాణకు చెందిన హోంమంత్రి సబితారెడ్డి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండు చేశారు. ప్రభుత్వం మొదట నిర్ణయించినట్టు డిసెంబర్ 18, 19 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇవ్వాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సై రాత పరీక్షను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి నుంచి విద్యార్థులు ఆందోళనకు దిగారు.