ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Suman Rathod
అదిలాబాద్: జిల్లాకు చెందిన ఖానాపూర్ శాసన సభ్యురాలు సుమన్ రాథోడ్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. సుమన్ రాథోడ్ ఎస్టీ కానందున ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు 6వారల గడువును ఇచ్చింది. అయితే సుమన్ రాథోడ్ తన ఎన్నిక చెల్లుతుందని, హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టమని, అయితే ఈ తీర్పు న్యాయంగా లేనందున సుప్రీం కోర్టుకు వెళతామని చెప్పారు.

తనకు 1972లోనే పెళ్లయిందని, బంజారాలను ఎస్టీలో చేరుస్తూ పార్లమెంటు సైతం 2003లోనే బిల్లును ఆమోదించిందని ఆలాంటప్పుడు తన ఎన్నిక ఎలా చెల్లదని ఆమె అన్నారు. తమకు న్యాయం జరగనందున పైకోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతామన్నారు. సుమన్ రాథోడ్ భర్త, అదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు రమేశ్ రాథోడ్ హైకోర్టు తీర్పుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యాయం జరగలేదని పై కోర్టుకు వెళతామని చెప్పారు. కాగా తెదేపా సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు కూడా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.

2008లో తెలుగుదేశం పార్టీ తరఫున సుమన్ రాథోడ్ ఖానాపూర్ నుండి పోటీ చేసి గెలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభకు పోటీ చేసిన జోగి నాయక్ తమ్ముడు హరినాయక్ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం ఎస్టీలకు కేటాయించారని, తెదేపానుండి పోటీ చేసి గెలిచిన సుమన్ రాథోడ్ ఎస్టీ కాదని ఆమె ఎన్నిక రద్దు చేయాలని ఆయన పిల్ దాఖలు చేశారు. ఆ తీర్పు సోమవారం వెలువడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X