హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిగ్గు, లజ్జ ఉంటే జగన్ రాజీనామా చెయ్యాలి: పాల్వాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఆత్మభిమానం ఉన్నా వెంటనే కుటుంబ సభ్యులందరు తమ తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా సాక్షి ఎదుట ధర్నా చేస్తేనే చంపేస్తామని బెదిరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. సిగ్గు, లజ్జ ఉంటే వైయస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులు రాజీనామా చేయాలని పాల్వాయి అన్నారు.

ఇంత రాద్దాంతం చేస్తూ తల్లిలాంటి కాంగ్రెసు పార్టీనే విమర్శిస్తున్న జగన్ కు కాంగ్రెసు పార్టీలో ఉండే అర్హత లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారన్నారు. ఆయన ఆస్తులన్నింటిపైన ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలన్నారు. సాక్షిలో లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడివని ఆయన ప్రశ్నించారు. అవన్నీ కాంగ్రెసు పార్టీ పేరుతో సమకూర్చుకున్నవేనన్నారు. ఆసలు జగన్ ఎవరు, ఆయన అడ్రస్ ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అధినేత్రి సోనియాగాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X