హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వర్గం రహస్య భేటీ: వ్యూహంపై చర్చలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు బుధవారం హైదరాబాద్ లోని ఓ రిసార్టులో సమావేశమయినట్లు సమాచారం. జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి అధ్వర్యంలో బోయినపల్లిలోని ఓ రిసార్టులో వారు భేటీ అయ్యారు. రోశయ్య రాజీనామా, తదంతర పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు అధిష్టానం ఎవరినైనా ముఖ్యమంత్రిగా చేసిన నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఎలా స్పందించాలనే విషయమై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

కాగా బెంగుళూరులో ఉన్న పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ సాయంత్రం జరిగే సిఎల్పీ సమావేశానికి హాజరు కాకూడదని నిశ్చయించుకున్నాడు. తన తల్లి విజయలక్ష్మిని కూడా సమావేశానికి వెళ్లవద్దని చెప్పినట్టు సమాచారం. అయితే తాజా రోశయ్య పరిణామాల నేపధ్యంలో ఆయన హుటాహుటిన బెంగుళూరునుండి హైదరాబాదుకు ప్రయాణం అయ్యాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X