పదవి తీసుకుంటే తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తాం: కెయు ఐకాస
State
oi-Srinivas G
By Srinivas
|
వరంగల్: తెలంగాణకు చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తెలంగాణ ఉద్యామాన్ని అణిచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆలాంటి ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ సమితి శుక్రవారం డిమాండ్ చేసింది. తమకు ఉప ముఖ్యమంత్రి పదవి వద్దని తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే చాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంత్రి పదవుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టొద్దని హెచ్చరించారు. విద్యార్థులు కాంగ్రెస్ దిష్టిబొమ్మతో వరంగల్లో ర్యాలీ నిర్వహించి, అనంతరం అమరవీరుల స్థూపం వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని తెలంగాణ నాయకులు ప్రయత్నాలు చేస్తే వారిని తెలంగాణ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు.
కాగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ని కలిసి ఖమ్మంలో చేపడుతున్న దుమ్ముగూడెం ప్రాజెక్టును రద్దు చేయాలని కోరారు. ఆ ప్రాజెక్టు వల్ల నష్టమే తప్ప లాభం లేదని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా దానితో ఉపయోగమేమీ లేదన్నారు. ప్రాజెక్టును నిలిపివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి