వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపోడ్, ఐఫోన్ లపై భారతీయ భాషల అధ్యయానికి కొత్త ఎపిపి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Indian Languges
ఆస్టిన్: ప్రపంచం మొత్తం గర్వించదగ్గ దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. అది మాత్రమే కాకుండా వేగంగా అభివృధ్ది చెందుతున్న, అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం భారతదేశమని అన్నారు ఇటీవల ఇండియా టూర్ కువచ్చినటువంటి అమెరికా ప్రెసిండెంట్ బరాక్ ఒబామా. ప్రపంచం లో మీరు ఎక్కడికి వెళ్శిన మీకు భారతీయులు కనిపిస్తారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వాణిజ్య కేంద్రాలైన న్యూయార్క్, మెల్ బోర్న్ ల్లో మాత్రమే కాకుండా, లండన్ లో మీరు టాక్సీకోసం ఆగి ఉన్నప్పుడు కూడా మీరు ఆశ్చర్యకరంగా ఓ భారతీయుడు మిమ్మల్ని కలవవచ్చు. భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి ప్రాంతీయ భాషలు ఉన్నప్పటికీ మనందరినీ విశ్వవ్యాప్తంగా భారతీయత కలిపిందినేది నిస్సందేహం.

విదేశాల్లోని అలాంటి భారతీయులు ఉపయోగిస్తున్న ఫోన్లలో ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేయక పోవడం వల్ల వారి సోంత భాషలో వార్తలు చదువుకోలేకపోతున్నారు. ఎక్కువ ప్రాచుర్యం పోందినటువంటి ఆపిల్ ఐపోడ్, ఐఫోన్ లు ఇప్పటి వరకు భారతీయ భాషలను నుసపోర్టు చేయని విషయం అందిరికి తెలిసిందే. దాన్ని అధిగమించడానికి ఓ కొత్త అద్యయనానికి శ్రీకారం చుట్టింది 'ఎయిమ్ కారా'.

ఈ 'ఎయిమ్ కారా' అప్లికేషన్స్ భారతీయ భాషలను మీ ఐపోడ్, ఐఫోన్ లలో ఎలా ఉపయోగించుకోవాలో అర్దవంతంగా వివరిస్తుంది. అంతేకాకుండా ఇలాంటి సరికోత్త అప్లికేషన్స్ నుఉపయోగించడం వల్ల మొబైల్ ప్లాట్ ఫామ్ లో మీకొక సరికోత్త అనుభవం కలుగజేస్తుంది. అంతేకాకుండా దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు మొబైల్ విశ్లేషకులు.

ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి భారతీయులు ఈ అప్లికేషన్ ద్వారా తమ పిల్లలకు తమ మాతృభాషలో చదవడం, రాయడం నేర్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ 'ఎయిమ్ కారా' అప్లికేషన్స్ చాలా సింపుల్ గా అందరికి ఇట్టే అర్దమయ్యే ప్రాంతీయ భాషల్లోనే రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ అప్లికేషన్స్ ద్వారా వర్ణమాలను మీరు చాలా సులువుగా బోధించవచ్చు, ఎందుకంటే ఇందులో సింబల్స్, మాటర్స్ ఉన్నాయి కాబట్టి. వీటితో పాటు వినేవారి కోసం ఆడియో, విజువల్ ఫీచర్స్ ని పెంపోందించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నాయని అన్నారు.

Read: English / ಕನ್ನಡದಲ್ಲಿ / हिन्दी में/ Tamil

ఈ అప్లికేషన్స్ మీకోసం అన్ని ఆపిల్ స్టోర్స్ లోడౌన్ లోడ్ చేసుకోవచ్చని అన్నారు. ప్రస్తుతానికి అందరికి అందుబాటులో లాంగ్వేజ్ వర్షన్ 1.0ని ప్రవేశపెడుతున్నామని అన్నారు. త్వరలో మీ భాషను అభివృధ్ధి చేసుకోవడానికి, మీ స్కిల్స్ ని పెంపోందించుకోవడానికి ఇంకా కొత్త వర్షన్స్ ని ప్రవేశపెడతామని తెలిపారు. ఈ సందర్బంలో 'ఎయిమ్ కారా' ప్రతినిధులు మాట్లాడుతూ ఎవరి మాతృ భాషలో వాళ్శు చాలా చక్కగా రాయడం, చదడవడం మాత్రమే కాకుండా చక్కగా మాట్లాడాలని కోరుకుంటున్నామని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X