హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుగుబాటుకే సిద్ధపడుతున్న వైయస్ జగన్ క్యాంప్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై చర్యలకు కాంగ్రెసు అధిష్టానం వేగంగా పావులు కదుపుతున్నా ఆయన వర్గం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి వైయస్ జగన్ పై చేసిన వ్యాఖ్యల తర్వాత వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు మాట్లాడిన తీరు ఆ విషయాన్ని తెలియజేస్తోంది. అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పుల్లా పద్మావతి, గోనె ప్రకాశ రావు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టారు. పార్టీ అధిష్టానానికీ వైయస్ జగన్ కూ మధ్య అగాధం పెట్టడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు, గట్టు రామచందర్ రావు, పుల్లా పద్మావతి అన్నారు.

వైయస్ జగన్ పై చర్య తీసుకుంటుందని తాము అనుకోవడం లేదని, వైయస్ జగన్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదని వారన్నారు. రోశయ్యను గానీ కిరణ్ కుమార్ రెడ్డిని గానీ నేతగా అధిష్టానం నేతగా ఎంపిక చేసిన సమయంలో వైయస్ జగన్ వర్గానికి చెందినవారని చెబుతున్న శాసనసభ్యులెవరూ వ్యతిరేకించలేదని గట్టు రామచందర్ రావు అన్నారు. సాక్షి మీడియా వార్తాకథనాలతో వైయస్ జగన్ కు సంబంధం లేదనే వారంతా ఇప్పటికీ వాదిస్తున్నారు. సాక్షి వార్తాకథనాలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటోందనే వార్తలు వస్తున్నా అదే వాదనకు వారు కట్టుబడి మాట్లాడుతున్నారు. మంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించిన వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిపై వారు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవి తీసుకోవాడనికి కూడా ఆంగీకరించబోనని చెప్పారు. తనకూ కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన అన్నారు. తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకోవడం లేదని, తాను ఆశించడం కూడా లేదని ఆయన చెప్పారు. ఆదినారాయణ రెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మంత్రి పదవుల కోసం వైయస్ జగన్ వర్గానికి చెందినవారెవరూ ఎదురు చూడడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X