హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వాన్ని కూల్చే నీచ ఆలోచన వైయస్ జగన్ కు లేదు: అంబటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గానీ కూల్చే నీచమైన ఆలోచన వైయస్ జగన్ కు లేదని కాంగ్రెసు బహిష్కృత నేత అంబటి రాంబాబు చెప్పారు. తండ్రిని, కుమారుడిని వేరు చేసే కుటిల రాజకీయాలకు బాధాతప్త హృదయంతో వైయస్ జగన్ రాజీనామా చేశారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బెదిరించడం కోసం వైయస్ జగన్, వైయస్ విజయలక్ష్మి రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ రాజీనామా చేయడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. వైయస్ జగన్ తప్పో ఒప్పో ప్రజలే తేలుస్తారని ఆయన అన్నారు. వెటాడి వేటాడి జగన్ ను వేధించినందుకు కాంగ్రెసు పార్టీ మూల్యం చెల్లించుకుంటుందని ఆయన అన్నారు.

వైయస్సార్ ఆశయసాధన కోసం ప్రజల వద్దకు జగన్ వెళ్తారని ఆయన అన్నారు. వైయస్ జగనే తమ నాయకుడని ఆయన అన్నారు. వైయస్ జగన్, వైయస్ విజయలక్ష్మి రాజీనామాలు చేసిన తర్వాత ఆమోదించాల్సిందేనని ఆయన అన్నారు. రాజీనామాలు వైయస్సార్ కుటుంబ సభ్యులు తీసుకున్న కఠోర నిర్ణయమని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఒంటరి వాడు కాడని, వైయస్ జగన్ ను ప్రజలే కాపాడుకుంటారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X