వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ రాజీనామాను తేలిగ్గా తీసుకున్న కాంగ్రెసు అధిష్టానం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ రాజీనామాస్త్రాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్టానం చాలా తేలిగ్గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. పార్టీ అధిష్టానానికి చెందిన నాయకులు మాట్లాడుతున్న తీరు ఈ విషయాన్ని తెలియజేస్తోంది. వైయస్ జగన్ రాజీనామా ఆయన వ్యక్తిగతమని ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని ఆయన అన్నారు. ఇటువంటి రాజీనామాలు చాలా చూశామని ఆయన అన్నారు. చాలా మంది పార్టీకి రాజీనామాలు చేసి తిరిగి వచ్చారని ఆయన గుర్తు చేశారు. దీన్ని బట్టి వైయస్ జగన్ రాజీనామాకు పార్టీ అధిష్టానం పెద్దగా గుర్తింపు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్ రాజీనామాను మరో ఎఐసిసి నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కూడా తేలిగ్గా తీసుకున్నారు. దీన్ని బట్టి పార్టీ అధిష్టానం కోరుకున్నదే జగన్ చేసినట్లు కనిపిస్తోంది. తనంత తానుగా వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేయాలని కాంగ్రెసు అధిష్టానం చాలా కాలంగా వ్యవహరిస్తూ వస్తోంది. అందుకు అనుగుణంగా వ్యవహరించింది. దీంతో వైయస్ జగన్ పార్టీకి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్న కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా వైయస్ జగన్ రాజీనామా వ్యవహారాన్ని తేలిగ్గానే తీసుకున్నట్లు కనిపించారు. జగన్ రాజీనామా వల్ల పార్టీకి ఏ విధమైన నష్టం జరగదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X