వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ రాజీనామాను ఆమోదించిన మీరా కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Meera Kumar
న్యూఢిల్లీ: లోకసభ సభ్యత్వానికి వైయస్ జగన్ చేసిన రాజీనామాను లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. వైయస్ జగన్ తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా లోకసభకు పంపారు. వైయస్ జగన్ రాజీనామా లేఖ తమకు అందిందని స్పీకర్ కార్యాలయం తొలుత తెలిపింది. వైయస్ జగన్ తో వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాతనే రాజీనామాను ఆమోదించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఆ వెంటనే వైయస్ జగన్ రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఢిల్లీలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

వైయస్ జగన్ రాజీనామా నేపథ్యంలో అహ్మద్ పటేల్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చలు జరిపారు. వైయస్ జగన్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన రాజీనామాను కూడా సోనియా వెంటనే అంగీకరించే అవకాశం ఉంది. ఒక రకంగా పార్టీ అధిష్టానం జగన్ ను పొమ్మన లేక పొగ పెట్టిందని చెప్పవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X